Asianet News TeluguAsianet News Telugu

చైనా బంగారు గనిలో చిక్కుకొన్న 22 మంది కూలీలు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

చైనాలోని ఓ బంగారు గనిలో రెండు వారాల నుండి చిక్కుకొన్న 22 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కార్మికులను రక్షించడం కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
 

22 workers trapped in gold mine explosion lns
Author
China, First Published Jan 21, 2021, 2:59 PM IST

బీజింగ్: చైనాలోని ఓ బంగారు గనిలో రెండు వారాల నుండి చిక్కుకొన్న 22 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కార్మికులను రక్షించడం కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

ఈ నెల 10వ తేదీన ఈ గనిలో పేలుడు సంభవించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్ లోని క్విజియా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బంగారు గనిలో పేలుడు చోటు చేసుకొంది.  ఈ పేలుడుతో 22 మంది కూలీలు గనిలోనే చిక్కుకొన్నారు.

గని పూర్తిగా మూసుకుపోయింది. కూలీలు వంద అడుగుల లోతులో చిక్కుకొన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గనికి సమాంతరంగా మరో వైపున డ్రిల్లింగ్ చేసి అక్కడి నుండి కూలీలకు ఆహారం ఇతర సౌకర్యాలను అందిస్తున్నారు.గనిలో చిక్కుకొన్న కూలీల్లో 11 మందిలో ఒకరు చనిపోగా మరొకరు కోమాలోకి వెళ్లినట్టు చైనా మీడియా తెలిపింది. మిగిలిన 10 మంది ఆచూకీ తెలవాల్సి ఉందని మీడియా ప్రకటించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios