Asianet News TeluguAsianet News Telugu

పీవోకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి..

పాక్ అక్రమిత కశ్మీర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మంది మృతిచెందగా, 8 మంది గాయపడ్డారు.

22 killed 8 injured after bus falls into ravine in PoK Sudhnoti district
Author
Islamabad, First Published Nov 3, 2021, 4:58 PM IST

పాక్ అక్రమిత కశ్మీర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మంది మృతిచెందగా, 8 మంది గాయపడ్డారు. పీవోకే‌లోని సుద్నోతి జిల్లాలో (Sudhnoti district) ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని బలూచ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండి‌కి బస్సు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే బస్సులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బస్సు తొలుత రోడ్డుకు ఎడమవైపున ఉన్న కొండను ఢీకొట్టింది. ఆ తర్వాత వెంటనే 500 అడుగుల లోయలో పడిపోయింది. 

బస్సు లోయలో పడిపోవడాన్ని చూసి రోడ్డు పక్కన షాపు నడుపుకునే వ్యక్తి స్థానిక మసీదు పెద్దగా ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. దీంతో మసీదు పెద్ద మైక్ (లౌడ్ స్పీకర్స్) ద్వారా సమాచారాన్ని గ్రామస్తులకు సమాచారం చేరవేశారు. గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రమాద స్థలానికి చేరుకోవాలని కోరారు. గాయపడిన వారిలో ఐదుగురిని కోట్లి జిల్లాకు, మరో ముగ్గురిని బెలోచ్ జిల్లాకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతిచెందినట్టుగా పూంచ్ డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ జనరల్ రషీద్ నయిమ్ వెల్లడించినట్టుగా పాకిస్తాన్ వార్త సంస్థ డాన్ రిపోర్ట్ చేసింది. 

అయితే పీవోకే‌లు రహదారులు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇక్కడ ప్రయాణించాలంటే డ్రైవర్ల అప్రమత్తత చాలా అవసరం. అయితే రోడ్ల పరిస్థితి కూడా బాగాలేకోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.  ఇక, గత నెలలో పీఓకేలోని పూంచ్, నీలం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు విద్యార్థులు, పలువురు ప్రయాణికులు మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios