Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దంలో సైనికులతో పాటు అమాయక పౌరులు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దమనకాండలో ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారని ఉక్రెయిన్ జాతీయ జర్నలిస్టుల యూనియన్ తెలిపింది. ఈ యుద్ధం ఎవరిని విడిచిపెట్టడం లేదు. సైనికులు, పౌరులు, మీడియా ఉద్యోగుల జీవితాలను హరిస్తుందని యూనియన్ పేర్కొంది.
Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా నెలన్నర రోజులకు దాడులు చేస్తునే ఉంది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ ను ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పుతిన్ మారణ హోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న.. ఏ మాత్రం పట్టించుకోకుండా.. దాడులను కొనసాగిస్తున్నారు. ఈ యుద్దంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రోజులు గడిచే కొద్దీ రష్యా బలగాలు తమ దాడులను పెంచుతూనే ఉన్నారు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా టార్గెట్‌గా దాడులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఈ యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా కనీసం 20 మంది జర్నలిస్టులు మరణించారని ఉక్రెయిన్ జాతీయ జర్నలిస్టుల యూనియన్ బుధవారం తెలిపింది. ఈ యుద్ధం ఎవరినీ విడిచిపెట్టదు.. ఇది సైనికులు, పౌరులు, మీడియా ఉద్యోగుల జీవితాలను బలి తీసుకుంటుందని యూనియన్ పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లోకి సైన్యాన్ని రమ్మని ఆదేశించినప్పటి నుండి విధి నిర్వహణలో ఇతరత్రా చంపబడిన 20 మంది జర్నలిస్టుల జాబితాను ఇది ప్రచురించింది. వీరిలో రష్యన్ జర్నలిస్ట్ ఒక్సానా బౌలినా, అమెరికన్ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత బ్రెంట్ రెనాడ్, ఐరిష్ కెమెరామెన్ పియర్ జక్ర్జెవ్‌స్కీ, లిథువేనియన్ డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు మాంటాస్ క్వెదరవిసియస్ ఉన్నారు. ఉక్రెయిన్‌లో మృత్యువాత పడ్డ రష్యన్ రిపోర్టర్ కోసం బలమైన, ధైర్యవంతమైన శక్తిగా గుర్తుచేసుకున్నారు. ఇటీవలి మరణించిన వారిలో 78 ఏళ్ల ఉక్రేనియన్ జర్నలిస్టుల యూనియన్ సభ్యుడు యెవెన్ బాల్, వీడియో ఇంజనీర్ రోమన్ నెజిబోరెట్స్ ఉన్నారు.
జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడం, హింసించడం, చంపడం అసహ్యకరమని, దానిని ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేసింది యూనియన్. రష్యాలో కనీసం 150 మంది జర్నలిస్టులు దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. 40 వార్తా సంస్థలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కార్యకలాపాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే..యుద్ధం గురించి నకిలీ వార్త ప్రచురిస్తే.. దాదాపు 15 సంవత్సరాల జైలు శిక్షను విధించనున్నట్టు రష్యన్ అధికారులు హెచ్చరించారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా ఆయుధాలను పంపిచనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. రష్యాపై ఘాటైన విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లోమ నరమేధం సృష్టిస్తున్నారన్నారు. ఉక్రెయిన్‌లోని కీవ్‌ను, మరియుపోల్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతోనే రష్యా దాడులు సాగుతున్నాయని ఆయన అన్నారు.
