గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు..20 మంది మృతి.. 300 మందికి పైగా..
అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబఖ్ గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 68 మంది మృతి చెందగా.. 300 మందికి పైగా ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు.
అజర్‌బైజాన్‌లోని నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంతో ఇప్పటివరకు 20 మంది మరణించగా.. 300 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం అర్థరాత్రి ప్రజలు తమ వాహనాల్లో ఇంధనం నింపేందుకు గ్యాస్ స్టేషన్ వెలుపల లైన్‌లో నిలబడి ఉండగా పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.
పేలుడు చాలా శక్తివంతమైనదని, ఘటనా స్థలం నుంచి 13 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో.. 290 మందికి పైగా గాయపడ్డారనీ, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది. అయితే గ్యాస్ స్టేషన్‌లో పేలుడు సంభవించడానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.
ఈ ఘటనపై నాగోర్నో-కరాబాఖ్ అధ్యక్షుడి సహాయకుడు డేవిడ్ బబయాన్ మాట్లాడుతూ.. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైందని తెలిపారు. ఈ ప్రమాదం తర్వాత బాధితులను ఆదుకునేందుకు రష్యా సైన్యం హెలికాప్టర్లను కూడా అందించిందని ఆర్మేనియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
హెలికాప్టర్ సహాయంతో బాధితులను అర్మేనియాకు తరలించారు. అజర్బైజాన్ సైన్యం నాగోర్నో-కరాబఖ్ ప్రాంతంలో అర్మేనియా స్థానాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు కాల్పుల్లో దాదాపు 25 మంది చనిపోయారు. అయితే, అజర్‌బైజాన్ తర్వాత విడిపోయిన నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై పూర్తి నియంత్రణను ప్రకటించింది. ఆర్మేనియా సైనికులు కూడా లొంగిపోయారు.