Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ మద్దతు ర్యాలీపై కాల్పులు.. ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు..

ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన ఓ ర్యాలీపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెడుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.

2 Women Injured As Shooter Fires Pellet Guns At Pro-Trump Rally - bsb
Author
Hyderabad, First Published Nov 7, 2020, 4:03 PM IST

ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు నిర్వహించిన ఓ ర్యాలీపై గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడెర్డేల్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మద్దతుదారులు శుక్రవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెడుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగుడు కాల్పులు జరిపాడు.

నార్త్ ఫెడరల్ హైవే సమీపంలోని కోరల్ రిడ్జ్ మాల్‌కు దగ్గర ఈ ఘటన జరిగింది.  ర్యాలీ ఆ ప్రాంతానికి చేరుకోగానే కదులుతున్న కారులోంచి దుండగుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ర్యాలీని లక్ష్యంగా చేసుకునే దుండగుడు కాల్పులు జరిపినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. 

ఘటన జరిగిన వెంటనే గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై అదే ఉత్కంఠ కొనసాగుతున్న విషయం తెలిసిందే. యావత్ ప్రపంచం తదుపరి అగ్రరాజ్యాధిపతి ఎవరు అనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ప్రస్తుతం డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష పీఠానికి అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వస్తే... ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. 

దీంతో బైడెన్ మ్యాజిక్ ఫిగర్ 270కు 6 ఎలక్టోరల్ ఓట్ల దూరం ఉన్నారు. ఇంకా ఐదు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. వీటిలో మూడింట బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో బైడెన్ విజయం సాధించిన అధ్యక్ష పీఠం అధిష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios