Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్‌ ను కుదిపేసిన  భారీ భూకంపం .. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు..

భారత్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో మంగళవారం అర్థరాత్రి బలమైన భూకంపనాలు సంభవించింది.  6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

2 Killed, 6 Injured As Powerful 6.8 Magnitude Earthquake Jolts Pakistan
Author
First Published Mar 22, 2023, 4:33 AM IST

ఇస్లామాబాద్, భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లో మంగళవారం అర్థరాత్రి భూకంపం సంభవించింది. జాతీయ మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపాల కారణంగా పాకిస్తాన్‌లో కనీసం ఇద్దరు మరణించారు, అలాగే ఆరుగురు గాయపడ్డారు.

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంప కేంద్రం 

6.8 తీవ్రతతో సంభవించిన భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్‌కు ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి.దాదాపు 190 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం.. మంగళవారం పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్,  భారతదేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.

ఇద్దరు మృతి.. పలువురికి తీవ్రగాయాలు

ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఇంటి పైకప్పు, గోడలు  కూలిపోయిన సంఘటనలలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ప్రావిన్స్‌లో పలు ఇళ్ళు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇద్దరు మృతి చెందగా, 150 మంది గాయపడినట్లు స్వాత్ జిల్లా పోలీసు అధికారి షఫివుల్లా తెలిపారు. చికిత్స నిమిత్తం సైదులు బోధనాసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్, రావల్పిండి, క్వెట్టా, కోహట్, లక్కీ మార్వాట్, డేరా ఇస్మాయిల్ ఖాన్, దక్షిణ వజీరిస్తాన్ , దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి.

ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశాలు  

అదే సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో పాటు ఇతర సంస్థలను ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆదేశించారు. ఇస్లామాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు హై అలర్ట్‌లో ఉన్నాయని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపినట్లు డాన్ తెలిపింది. ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఆదేశాల మేరకు ఆసుపత్రులకు అలర్ట్ ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios