కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి: పాకిస్థాన్‌లోని కరాచీలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అలాగే.. భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు సమాచారం.
కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై ఉగ్రదాడి: పాకిస్థాన్‌లోని కరాచీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్ర దాడికి పాల్పడ్డారు. పాకిస్థాన్ మీడియా ప్రకారం.. కరాచీలోని షరియా ఫైసల్‌లో ఉన్న పోలీసు చీఫ్ కార్యాలయంలో 10 మందికి పైగా ఉగ్రవాదులు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోకి చొరబడ్డారు. ఆ తరువాత కరాచీ పోలీసు కార్యాలయంలోని లైట్లన్నీ ఆరిపోయాయనీ, అన్ని తలుపులు మూసినట్టు తెలిపింది. ఈ దాడిలో ఒక పోలీసు, ఒక పౌరుడు మరణించినట్టు , ప్రస్తుతం ఎదురు కాల్పులు జరుగుతున్నాయని పాకిస్తాన్ జియో న్యూస్ నివేదిక పేర్కొంది.
ఐదంతస్తుల భవనంలోకి భద్రతా అధికారులు వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసు చీఫ్ కార్యాలయం లోపల నుంచి పేలుళ్ల శబ్దాలు వినిపించాయనీ, నాలుగో అంతస్తులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నాడని ARY న్యూస్ నివేదించింది. శక్తివంతమైన పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయని తెలిపింది. కాగా, మూడు అంతస్తులను క్లియర్ చేసినట్లు సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముర్తాజా వహాబ్ తెలిపారు. ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో కూర్చుని, గ్రెనేడ్లు విసురుతూ, లోపల నుంచి కాల్పులు జరుపుతున్నారనీ, గతంలో కూడా మియాన్‌వాలి పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపారు.
అప్రమత్తమైన అధికార యాంత్రాంగం.. కొనసాగుతున్న ఎన్ కౌంటర్..
అప్రమత్తమైన అధికార యాంత్రంగం.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కు భారీ సంఖ్యలో పోలీసులు, రేంజర్లను తరలించింది. ఈ తరుణంలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో రెస్క్యూ వర్కర్ గాయపడగా, ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. రెస్క్యూ వర్కర్‌ను జిన్నా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన రెస్క్యూ వర్కర్‌ను ఈధి వాలంటీర్ 25 ఏళ్ల సాజిద్‌గా గుర్తించారు. సాజిద్‌కు రెండు బుల్లెట్లు తగిలాయని రక్షణ వర్గాలు తెలిపాయి.
అదే సమయంలో కరాచీలోని జిన్నా హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ విధించారు. కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంపై జరిగిన దాడిపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా నోటీసులు అందుకున్నారు. సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డిఐజి)ని KOPకి బృందాలను పంపి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారుల నుంచి ఎప్పటికప్పడూ సమాచారం తెలుసుకుంటున్నారు. కరాచీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై జరుగుతున్న దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ప్రకటించింది. దీనిపై త్వరలో వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్‌కు చెందిన ఒమర్ మీడియా తెలిపింది.
ఇద్దరి మృతి
పోలీసు చీఫ్ కార్యాలయంపై జరిగిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని కరాచీ పోలీస్ సర్జన్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో చెప్పారు. కార్యాలయం లోపల ఉన్న పోలీసు అధికారుల సంఖ్య ధృవీకరించబడనప్పటికీ, దాడి జరిగిన సమయంలో స్టేషన్‌లో 30 మంది వరకు పోలీసులు ఉండేవారని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇర్ఫాన్ బలోచ్ చెప్పారు.
