పడవ మునిగి దాదాపు 18మంది మృతి  చెందిన సంఘటన బ్రెజిల్ లోని అమెజాన్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.  అమెజాన్ ఉపనది అయిన జారీలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సహాయక సిబ్బంది ఇప్పటివరకు 46 మందిని కాపాడారు.

Also Read ఇవాంకతో సెల్పీ దిగాలనుకుని.. దిగలేక: ఇలా ఎడిట్ చేసుకున్నారు...

మరో 30 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హెలికాప్టర్లు, విమానాలు, గజ ఈతగాళ్లు తో గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన బ్రెజిల్ నావికాదళం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడింది.