అందం, చలాకీతనం, తెలివి తేటలతో వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకురాలిగా అమెరికా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్. వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించి సమాచారాన్ని ఆమె ఎప్పుడూ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

అందుకే ఆమె ఖాతాలకు ఫాలోయింగ్ అదే స్థాయిలో ఉంటుంది. భారత్‌లోనూ ఆమెకు అభిమానులు ఎక్కువే. దీంతో ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఇవాంకను ఒక్కసారైనా కలిసి ఆమెతో సెల్ఫీ తీసుకోవాలని చాలా మంది భావించారు.

ఆ కోరిక తీరకపోవడంతో ఇవాంకతో సెల్ఫీ తీసుకున్నట్లుగా ఫోటోలను ఎడిట్ చేసి మురిసిపోతున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి.

వీటిలో ఓ కుర్రాడు సైకిల్‌పై ఎక్కించుకుని తిప్పినట్లుగా, తాజ్‌మహాల్ వద్ద తన పక్కన కూర్చొని ఉన్నట్లుగా ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఇవాంక భారత్‌లో తనకు కొత్త స్నేహితులు దొరికారంటూ ట్వీట్ చేశారు.