Asianet News TeluguAsianet News Telugu

కరోనా కల్లోలం : ఆకలితో అలమటిస్తున్న వేలాది అమెరికా సైనిక కుటుంబాలు..

corona virus దెబ్బకు సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆకలి కేకలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దిగువస్థాయిలో పనిచేసే వారి జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చాలా మంది soldiers భార్యలు కూడా కోవిడ్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు అని ఫీడింగ్ అమెరికా పేర్కొంది.  

160000 US military families struggle with food scarcity
Author
Hyderabad, First Published Nov 16, 2021, 1:36 PM IST

అమెరికా :  ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా.. ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడ లాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు లక్షా 60 వేల మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే నమ్మగలరా?  ఆశ్చర్యం అనిపించవచ్చు.. కానీ ఇది చేదు నిజం అంటోంది ‘ఫీడింగ్ అమెరికా’ సంస్థ.  

corona virus దెబ్బకు సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆకలి కేకలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి. దిగువస్థాయిలో పనిచేసే వారి జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చాలా మంది soldiers భార్యలు కూడా కోవిడ్ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు అని ఫీడింగ్ అమెరికా పేర్కొంది.  

కరోనాకు ముందు చాలా మంది సైనికుల భార్యలు కూడా ఉద్యోగాలు చేసేవారు.  దీంతో రెండు ఆదాయాలతో కుటుంబం సమతుల్యంగా ఉండేది. కానీ కరోనా మహహ్మారి చాలామందిని Unemployedగా మార్చేసింది. దీంతో ఇంట్లో పిల్లలకు వేళకు తిండి లేని పరిస్థితి నెలకొంది. ‘ఈ కఠిన వాస్తవం సాధారణ Americansకు తెలియకపోవచ్చు. కానీ సైన్యంలో చాలామందికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంలో  మేము సభ్యులు.  మా కుటుంబాలకు మాత్రం food దొరకడం లేదు.  ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడడం పై  వారు ఎలా దృష్టి పెట్టగలరు’ అని ఇరాక్ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్ హాక్ పైలట్ టేమీ డక్ వర్త్ఆవేదన వ్యక్తం చేశారు.

Delta Variant: చైనాలో రికార్డు బ్రేక్ చేసిన డెల్టా వేరియంట్ కేసులు.. ఆందోళనలో అధికారులు

ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని సెయింట్ లూయిస్ లో ఫుడ్ బ్యాంక్ నిర్వహించే  నాప్ తెలిపారు.  కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే తన కుటుంబంతో బతకడానికి సిద్ధమైన యువ సైన్యాధికారి గురించి తనకు తెలుసునని ఆమె చెప్పారు. ‘సైన్యం లోకి వెళ్ళిన తర్వాత ఒకరిని సాయం అడగడం చాలామంది అగౌరవంగా భావిస్తారు. అందుకే చాలా కుటుంబాలు తిండి దొరక్క ఇబ్బంది పడుతున్న బయటపడడం లేదు. సైన్యంలో దిగువ స్థాయి ర్యాంకుల్లో పనిచేసే  సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారు’ అని Feeding America సంస్థ తెలిపింది 

అమెరికా చట్టసభ ప్రతినిధులతో ప్రధాని మోడీ భేటీ....
ఇదిలా ఉండగా భారత ప్రధాన మంత్రి Narendra Modi అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధులతో నవంబర్ 13న సమావేశమయ్యారు. రీజనల్ సమస్యలపై ఉభయవర్గాల ప్రయోజనాలపై ఫ్రాంక్‌ డిస్కషన్ చేశారు. దక్షిణాసియా, ఇండో పసిఫిక్ రీజియన్ అంశాలపైనా చర్చ జరిపారు. సెనేటర్ జాన్ కొర్నిన్ సారథ్యంలోని సెనేటర్ మైఖేల్ క్రాపో, సెనేటర్ థామస్ టబర్విల్లే, సెనేటర్ మైఖేల్ లీ, కాంగ్రెస్‌మన్ టోనీ గొంజేల్స్, కాంగ్రెస్‌మన్ జాన్ కెల్వినర్ ఎలీజీ సీనియర్‌లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. అయితే, ఈ భేటీ China లక్ష్యంగా సాగిందా? అనే చర్చ కూడా జరుగుతున్నది.

కరోనా సమయంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ భిన్న ప్రజలు నివసించే పెద్ద దేశమైనప్పటికీ సమర్థవంగా వ్యవహరించారని America కాంగ్రెషనల్ ప్రతినిధులు మెచ్చుకున్నారు. ప్రజాస్వామిక విలువల ఆధారంగా ప్రజలూ ఈ మహమ్మారి కట్టడికి నడుం బిగించారని, అందుకే ఈ శతాబ్దంలో తీవ్రమైన మహమ్మారి కరోనాను ఎదుర్కోవడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios