Asianet News TeluguAsianet News Telugu

తండ్రిని దారుణంగా హతమార్చిన 12ఏళ్ల కూతురు.. కారణం విని ఖంగుతిన్న అధికారులు

కన్న కూతురే తండ్రి మెడపై మూడు సార్లు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చింది. 12ఏళ్ల ఆ బాలిక తన 13ఏళ్ల మిత్రురాలి సహాయంతో తండ్రిని చంపేసింది. తండ్రిని చంపడానికి గల కారణాలు విని అధికారులు ఖంగుతిన్నారు. 2002లో ఓ మర్డర్ కేసు నుంచి ఇన్‌స్పైర్ అయి తామూ కిల్లర్ గర్ల్‌గా ఫేమస్ కావాలనే ఈ హత్య చేసినట్టు వివరించారు.

12 year old daughter kills father for becoming famous
Author
New Delhi, First Published Oct 24, 2021, 6:10 PM IST

న్యూఢిల్లీ: కన్న కూతురే తండ్రిని దారుణంగా హతమార్చింది. Father మెడపై knifeతో మూడు సార్లు పొడిచి 12ఏళ్ల ఆయన Daughter కిరాతకంగా చంపేసింది. ఈ దారుణానికి తెగబడటానికి ఆమె తన 13 ఏళ్ల ఫ్రెండ్ సహకారాన్ని తీసుకుంది. ఈ అఘాయిత్యం ఒక ఎత్తు అయితే, తండ్రిని చంపడానికి ఆమె చెప్పిన కారణమూ మరో ఎత్తు. తండ్రిని చంపడానికి ఆమె చెప్పిన కారణాన్ని విని దర్యాప్తు అధికారులు ఖంగుతిన్నారు.

ఆ బాలిక 2002లో చోటుచేసుకున్న ఓ మర్డర్ కేసు గురించి తెలుసుకుని ప్రేరణ పొందింది. ఆ కేసులో మాదిరిగానే తానూ తన తండ్రిని చంపేసి కిల్లర్ గర్ల్‌గా ఫేమస్ కావాలని భావించిందని, ఆ కోరికతోనే తన స్నేహితురాలి సహాయం తీసుకుని కన్న తండ్రిని హతమార్చినట్టు అధికారులకు వివరించింది. దీంతో షాక్ తినడం అధికారుల వంతు అయింది.

Also Read: హ‌య‌త్‌న‌గ‌ర్‌ : కారులో మృతదేహం.. వీడిన మిస్టరీ, మరిదితో కలిసి భర్తను చంపిన భార్య

బ్రెజిల్‌కు చెందిన 46 ఏళ్ల నీఫ్ లూయిజ్ వెర్లాంగ్ వృత్తిరీత్యా పోలీసు అధికారి. ఆయనకు 12ఏళ్ల కూతురు ఉన్నది. కానీ, ఆమె మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నదో ఆయనకు తెలియదు. ఒకప్పటి మర్డర్ కేసు తరహాలోనే తండ్రిని చంపేసి ఫేమస్ కావాలని తప్పుడు ఆలోచనలో పడింది.

20ఏళ్ల క్రితం బ్రెజిల్‌లో సుసాన్ లూయిస్ అనే బాలిక తన బాయ్‌ఫ్రెండ్ సహకారంతో తల్లిదండ్రులను చంపేసింది. ఆ తర్వాత వారు పోలీసులకు లొంగిపోయారు. చేసిన నేరాన్ని అంగీకరించారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే రీతిలో తాజా కేసులోనూ నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. వారిద్దరికీ కిల్లర్ గర్ల్‌గా ఫేమస్ కావాలనే ఉన్నదని, ఆ కోరికతోనే హత్యకు పాల్పడ్డట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios