(hyderabad) హైదరాబాద్ (hayat nagar) హయత్‌నగర్‌ హత్య కేసు (murder case) మిస్టరీ వీడింది. మృతుడి తమ్ముడు, భార్య కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసి మృతదేహాన్ని నగర శివార్లలోకి తరలించారు

(hyderabad) హైదరాబాద్ (hayat nagar) హయత్‌నగర్‌ హత్య కేసు (murder case) మిస్టరీ వీడింది. మృతుడి తమ్ముడు, భార్య కలిసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య చేసి మృతదేహాన్ని నగర శివార్లలోకి తరలించారు. అయితే రోడ్డుపై కారు ఆగిపోవడంతో మృతదేహంపై కారం పోడి చల్లి అక్కడి నుంచి పరరాయ్యారు. వివాహేతర సంబంధమే హత్యకు (extra marital affair) కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని కాచిగూడకు చెందిన లారీ డ్రైవర్ ముస్తాఫాగా గుర్తించారు. 

అంతకుముందు హ‌య‌త్‌న‌గ‌ర్‌ బావ‌ర్చీ హోట‌ల్ ఎదురుగా శనివారం ఉద‌యం కారులో మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, డాగ్ స్క్వాడ్‌తో త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ హ‌త్య అర్ధ‌రాత్రి జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావించారు. ఎక్క‌డో చంపేసి హ‌య‌త్‌న‌గ‌ర్‌లో వ‌దిలివెళ్లిన‌ట్లు పోలీసులు అనుమానించారు. బావ‌ర్చీతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలించారు