అమెరికాలో విమానం కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్‌క్రాఫ్ట్‌ కింగ్ ఏయిర్ 350 రకానికి చెందిన విమానం టెక్సాస్‌లోని యాడిసన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే ఎయిర్‌పోర్టు హ్యాంగర్‌ను ఢీకొట్టింది.

ఆ వెంటనే మంటలు చెలరేగడంతో విమానంలో ఉన్న పది మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.  ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు ఆదేశించింది.