మలాలాపై కాల్పులు జరిపిన టెర్రరిస్ట్ ఫజలుల్లా హతం

'Mullah Radio', man who shot Malala, reportedly killed by US in drone strike
Highlights

టెర్రరిస్ట్ ఫజలుల్లా హతం

ఇస్లామాబాద్:  నోబెల్ బహుమతి గ్రహీత మలాలాపై కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫజల్ ఉల్లా అమెరికా డ్రోన్ దాడుల్లో హతమయ్యారు. ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లా, అతని అనుచరుడు మలాలాపై 2014లో కాల్పులు జరిపారు.ఈ ఘటన ఆనాడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే ఆ ఘటనలో తుపాకీ తూటాలకు గాయపడిన మలాలా ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడింది. ఆప్ఘన్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని కునార్ ప్రావిన్స్‌లో ఈనెల 13న ఉగ్రవాద నిరోధక దాడులు నిర్వహించినట్టు అమెరికా మిలటరీ అధికారి మార్టిన్ ఒడెనెల్ ప్రకటించారు. ఈ దాడుల్లోనే  ఫజల్ ఉల్లా హతమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడులపై  వ్యాఖ్యానించేందుకు పెంటగాన్ అధికారులు నిరాకరించారు.
 
ముల్లా ఫజల్ ఉల్లా ఆదేశాలతోనే అమెరికా, పాక్‌లలో పలు కీలక దాడులు జరిగినట్టు వారు తెలిపారు. డిసెంబర్ 2014లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై జరిపిన భీకరదాడిలో ప్రధాన సూత్రధారి ముల్లా ఫజిలేనని చెప్పారు. ఈ దాడిలో 130 మంది పిల్లలతో సహా మొత్తం 151 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫజులుల్లాపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది.

loader