భారత్ పై కూడా బంగ్లా దేశ్ తరహా కుట్రలు.. సవాళ్ళను ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది..?
బంగ్లాదేశ్ పరిస్థితుల ప్రభావంతో భారత్ అప్రమత్తం అయ్యింది. ఆ ప్రభావం ఇండియాపై పడకుండా తగు చర్యలు తీసుకుంటోంది. ఈ విషయంపై హోమ్ మత్రం అమిత్ షా కీలక ప్రకటన కూడా చేశారు.
దేశాన్ని అస్థిరపరిచే విధానాలకు భారత్ దూరం.. అలాంటి లక్ష్యంతో పనిచేసే విదేశీ జోక్యాలను అడ్డుకోవడంతో.. ఇండియా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితిని నుంచి విజయవంతంగా తప్పించుకోగలిగింది. అయితే భారత్ ను కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టాలని బయట నుంచి అనేక శక్తులు పనిచేస్తున్నా.. వారిని కూడా భారత్ విజయవంతంగా నివారించింది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మరియు భారత సైన్యం తూర్పు కమాండ్ ADG నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రీసెంట్ గా ప్రకటించారు. సమస్యాత్మక దేశంలో నివసిస్తున్న భారతీయ పౌరులు, హిందువులు మరియు ఇతర మైనారిటీ వర్గాల భద్రతను ఎప్పటికప్పుడు పర్యావేక్షించడానికి ఈ కమిటీ బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ లోని పరిస్థితుల దృశ్య... ఇండియాపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో భారతదేశం సాధించిన విజయంపై నిపుణులు అంచనా వేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్ (IPCS)లో సీనియర్ ఫెలో అయిన అభిజిత్ అయ్యర్ మిత్ర, భారతదేశం యొక్క బలమైన విదేశాంగ విధానం గురించి.. అలాగే దేశానికి నష్టం చేసేవారికి నిధులు రాకుండా నిధులపై కఠినమైన నియంత్రణను సూచించారు.
బంగ్లాదేశ్ లో ఇలాంటి పరిస్థితికి అక్కడ అరాచక శక్తులను బయట నుంచి పెంచి పోషిస్తున్న దేశాలే కారణం కావడంతో.. ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని సంస్థలు తమ స్వార్ధం కోసం భారతదేశాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నాయని, అయితే ప్రభుత్వ దృఢమైన వైఖరి వల్ల ఇలాంటివి ఎన్ని వచ్చిన ఎదుర్కో గలమంటున్నారు. అలాంటి సంస్థలకు నిధులు అందకుండా చేస్తే.. వాటి పెరుగుదల ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక బంగ్లాదేశ్ లో హిందువుల జీవనంపై నిపుణులు ప్రమిత్ పాల్ చౌధురి ఆందోళణ వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లోని హిందువులు 1971 నుండి రాజకీయ - మతపరమైన దాడులను ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో కొంత మంది హిందువులను లక్ష్యంగా చేసుకోవడం.. అక్కడి హిందూవులలో అభద్రతా భావం పెంచుతుందన్నారు. అంతే కాదు 1971 మారణహోమం సమయంలో బెంగాలీలను బంగ్లాదేశ్ లో నిర్మూలించాలన్న ఉద్దేశంతోనే అల్లర్లు జరిగాయని.. దానికోసం పాకిస్తాన్ సైన్యం అనేక రకాల వ్యూహాలు పన్నిందన్నారు.
ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అశాంతి.. మరోసారి అలాంటి పరిస్థితులకు ఆజ్యంపోసిందన్నారు. ఇండియాలో కొన్ని భారీ నిరసనలను ఈ ప్రభుత్వం సులభంగా ఫేస్ చేసింది. రీసెంట్ ఇయర్స్ లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు.. భారీ ఎత్తున జరిగిన అల్లర్లను కూడా భారతదేశ ప్రభుత్వం సులభంగా ఫేస్ చేసింది. ఈ విషయంలో విదేశీ శక్తులు ఎంత ప్రయత్నించినా.. భారత్ ను అస్థిరపరచలేక పోయారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నదని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి మరియు జాతీయ భద్రతకు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉందని పలువురు అంగీకరిస్తున్నారు.