ప్రపంచ కప్ హోరులో భారత్ తన విజయ పరంపర కొనసాగిస్తోంది. సెమిస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ విషయం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నా... మరో విషయం మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. టీం ఇండియా ఆటగాళ్లకు గాయాల భయం పట్టుకుంది. మొన్నటికి మొన్న శిఖర్ థావన్ చేతికి గాయమై.. టీం కి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా... ఆ జాబితాలో  భువనేశ్వర్ కూడా చేరిపోయాడు.

ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియాకు మరో గాయం భయం పట్టుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా పిచ్‌పై పాదముద్రలపై కాలు జారడంతో భువీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో  అర్ధంతరంగా మైదానం నుంచి  నిష్క్రమించాడు. కేవలం 2.4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన భువి.. 8 పరుగులిచ్చాడు. అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్‌ చేశాడు.భువీ.. తర్వాత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని విరాట్‌ కోహ్లి చెప్పాడు. భువీ స్థానంలో షమీ ఆడే అవకాశముంది.