టీం ఇండియా క్రికెటర్లు ఆరెంజ్ కలర్ జెర్సీలో మెరిసిపోతున్నారు.  ప్రపంచకప్ లో భాగంగా రేపు( ఆదివారం) ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ తో టీంఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఆరెంజ్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనున్నారు ఈ నేపథ్యంలో న్యూ జెర్సీ ఎలా ఉంటుందో అభిమానులకు ముందుగానే తెలియజేశారు. నూతన జెర్సీలను ధరించిన క్రికెటర్లు.. వాటితో ఫోటోలు కూడా దిగారు. ఆ ఫోటోలను క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ఇప్పటి వరకు బ్లూ జెర్సీతోనే సత్తా చాటిన భారత్ సడెన్ గా జెర్సీ మార్చుకోవడానికి రీజన్ ఉంది. భారత్, ఇంగ్లాండ్ ఈ రెండు జట్ల జెర్సీలు ఒకే రంగులో ఉంటాయి. దీంతో వీక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు తమ జెర్సీని మార్చుకోవాలి. అయితే.. ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టుకాబట్టి వాళ్లు జెర్సీ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో టీం ఇండియానే జెర్సీ మార్చుకుంది. ఆరెంజ్, ముదురు నీలం రంగు కాంబినేషన్ లో ఉన్న ఈ జెర్సీలో ఆటగాళ్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.