వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్ మెట్ అంటూ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మంగళవారం ప్రపంచకప్ లో భాగంగా టీం ఇండియా బంగ్లాదేశ్ తో తలపడిన సంగతి తెలిసిందే.  కాగా... ఈ మ్యాచ్ లో విజయం భారత్ కే దక్కింది. జట్టు విజయానికి రోహిత్ శర్మ ఎంతగానే కృషి చేశాడు.

సెంచరీ చేసి.. జట్టు అత్యధిక స్కోర్ చేయడానికి సహాయపడ్డాడు. కాగా... ఈ మ్యాచ్ విజయానంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.  తాను కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ ఆటను చూస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచంలోనే రోహిత్ గొప్ప వన్డే బ్యాట్స్ మెన్ అంటూ పొగడ్తలు గుప్పించాడు. రోహిత్ ఇలా ఆడితేనే అందరూ ఆస్వాదిస్తారని చెప్పాడు.

అనంతరం బుమ్రా బౌలింగ్ గురించి మాట్లాడుతూ..‘‘బుమ్రా బౌలింగ్‌ ఎప్పుడూ కఠినమే. అందుకే అతని ఓవర్లను మేం కాపాడుకుంటాం. అతను ప్రపంచశ్రేణి బౌలర్‌. ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలో అతనికి బాగా తెలుసు. బంగ్లాదేశ్‌ ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆఖరి బంతి వరకు వారు పోరాడారు. మేం సెమీస్‌కు చేరడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహాన్ని సెమీఫైనల్స్‌లో కొనసాగిస్తాం.’’ అని చెప్పాడు.