లండన్: టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ టోర్నమెంటులో అరుదైన రికార్డు సృష్టించాడు. శ్రీలంకపై శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో సెంచరీ సాధించడం ద్వారా ఆ రికార్డును సృష్టించాడు. ఈ ప్రపంచ కప్ పోటీల్లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు బాదాడు. 

శ్రీలంకపై 103 పరుగులు చేయడం ద్వారా రోహిత్ శర్మ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర రికార్డును బద్దలు కొట్టాడు. ఒక ప్రపంచ కప్ టోర్నమెంటులో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. కుమార్ సంగక్కర నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చాడు. 

కుమార్ సంగక్కర 2015 ప్రపంచ కప్ టోర్నమెంటులో నాలుగు సెంచరీలు చేశాడు. శనివారం శ్రీలంకపై జరిగిన మ్యాచులో ఇండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇండియా మరో ఓపెనర్ 111 పరుగులు చేశాడు. రాహుల్ తో కలిసి రోహిత్ శర్మ 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.