వరల్డ్ కప్ హోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు టీం ఇండియా రెండు మ్యాచ్ లో పోటీపడగా.. ఆ రెండు మ్యాచ్ లను కైవసం చేసుకుంది. అయితే... ఇప్పుడు ఈ వరల్డ్ కప్ హోరుకి వర్షం అడ్డుగా మారింది. మారికాసేపట్లో ప్రారంభం కావాల్సిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ పై కూడా ఈ వర్ష ప్రభావం చూపిస్తోంది.

సోమవారం నుంచి కంటిన్యూస్ గా వర్షం పడటంతో మైదానం మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడటానికి కుదరలేదు. దీంతో... ఈ మ్యాచ్ రద్దు కానుందా అనే అనుమానం లేవనెత్తుతోంది. అయితే... మ్యాచ్ రద్దు అవ్వదని ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉంటే... వాతావరణ సహకరించక... నిజంగా మ్యాచ్ రద్దు అయితే.. ఇరు జట్లకు చెరో  పాయింట్ వచ్చి చేరుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్‌ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. అదనంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చి చేరుతుంది. అదే కనుక జరిగితే న్యూజిలాండ్ కి ఎక్కువ లాభం జరుగుతుంది. దీంతో... భారత్ కి పాక్ తో జరగబోయే మ్యాచ్ కీలకంగా మారనుంది.