లండన్: ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ కు ఇంగ్లాండు గండం తప్పింది. లీగ్ దశలో భారత్ ఇంగ్లాండుపై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండు సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ను ఎదుర్కోనుంది. ఆస్ట్రేలియా శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచులో దక్షిణాఫ్రికాపై ఓడిపోయింది. భారత్ శ్రీలంకపై గెలిచింది. 

చివరి లీగ్ దశ మ్యాచుల ఫలితాలతో భారత్ అగ్రస్థానంలోకి చేరుకుంది. దాంతో నాలుగు జట్లలో చివరి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో భారత్ తలపడుతుంది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పరిమితమై మూడో స్థానంలో నిలిచిన ఇంగ్లాండుపై తలపడనుంది. 

భారత్ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండు 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలువగా, న్యూజిలాండ్ 11 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారం ఇండియా న్యూజిలాండ్ పై సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం జరుగుతుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. 

లీగ్ దశలో ఇండియా ఇంగ్లాండుపై ఓడిపోగా, న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో న్యూజిలాండ్ పై కూడా ఇండియాకు విజయం అంత సులభమేమీ కాకపోవచ్చు.