ప్రపంచకప్ లో టీం ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. కాగా... అతను గాయం నుంచి కోలుకొని మళ్లీ త్వరలో జట్టుతో కలవనున్నాడు. అయితే... థావన్ తిరిగి రావడంపై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. గాయం నుంచి కోలుకున్నాక... థావన్ తిరిగి తన ఫాం ని కొనసాగించడం కష్టమని వెంగ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై ఆయన తాజాగా స్పందించాడు. ‘1983 ప్రపంచకప్‌ లీగ్‌ స్టేజ్‌లో నేను బాగా ఆడుతున్నప్పుడు గాయపడ్డాను. ఆ తర్వాత కోలుకునేసరికి కపిల్‌సేన సెమీస్‌కి చేరింది. అయితే అప్పటికే వరుస విజయాలతో వెళ్తున్న టీమిండియా ఫైనల్స్‌లోనూ అదే జట్టుని కొనసాగించింది. ఇక ధావన్‌ విషయానికొస్తే ఎంత త్వరగా కోలుకుంటాడో చెప్పలేను. ’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. తనకులాగానే థావన్ కి కూడా తిరిగి జట్టులో స్థానం ఇవ్వరేమో అనే అభిప్రాయాన్ని వెంగ్ సర్కార్ వ్యక్తం చేశారు.

ఇటీవల జట్టులో రిషబ్ పంత్ కి సెలక్టర్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే... రిషబ్ పంత్ కి పదులు అజింక్యా రహానేని సెలక్టర్లు ఎంపిక చేసి ఉంటే బాగుండేదని వెంగ్ సర్కార్ తన అభిప్రాయాన్ని వివరించారు.