ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించడంపై వివాదం రాజుకుంది. ప్రపంచకప్‌లో భాగంగా ఏవైనా రెండు జట్లు తలపడేటప్పుడు వాటి జెర్సీ ఒకే రంగులో ఉంటే.. ప్రతి జట్టు ప్రత్యామ్యాయ జెర్సీలను వాడాలని ఐసీసీ ఆదేశించింది.

దీనిలో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మ్యాచ్‌ భారత్.. బ్లూ కలర్ జెర్సీకి బదులు ఆరెంజ్ కలర్ జెర్సీ ధరించనుంది. టీమిండియా జెర్సీ నీలం రంగులో ఉంటుంది.. ఇంగ్లాండ్ జట్టు కూడా దాదాపు అదే రంగు జెర్సీని ధరిస్తుంది.

అయితే రంగు వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉండటంతో భారత్ కాషాయ రంగు జెర్సీని ధరించనుంది. అయితే ఇందులో అతిథ్య జట్టుకు మినహాయింపు ఉండటంతో ఇంగ్లాండ్ నీలం రంగు జెర్సీతోనే బరిలోకి దిగుతుంది.

అయితే ఆరెంజ్ కలర్‌పై భారత్‌లో వివాదం రాజుకుంది. ఈ రంగును కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కాషాయం రంగు జెర్సీ ధరిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఆ జట్టును టీమిండియా ధరించవద్దంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఏమీ లేని ధోనీ గ్లౌజ్‌పై ఉన్న లోగును తొలగించిన ఐసీసీ... ఓ రాజకీయ పార్టీని సూచించే కాషాయ రంగు జెర్సీని ఐసీసీ ఎలా అనుమతించిందని మండిపడుతున్నారు.