Asianet News TeluguAsianet News Telugu

అది తలనొప్పి, మంచి తలపోటే: బుమ్రా స్పందన

ఎవరికి వారు తమ ప్రతిభను చాటుకోవడంతో శుభపరిణమమని, అదే సమయంలో ఆటగాళ్ల మధ్య పోటీ కూడా పెరిగిపోయిందని బుమ్రా అన్నాడు. ప్రతీ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించడం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారిందని, అది మంచి తలపోటేనని అన్నాడు. 

World Cup 2019: Bumrah comments on Team India performance
Author
Manchester, First Published Jul 8, 2019, 7:05 AM IST

మాంచెస్టర్‌: ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శనపై ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా చమత్కారం విసిరాడు. ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ సత్తా చాటుతున్నారని, అది తుది జట్టు కూర్పు విషయంలో ఒక తలనొప్పిగా మారిపోయిందని అన్నాడు. 

ఎవరికి వారు తమ ప్రతిభను చాటుకోవడంతో శుభపరిణమమని, అదే సమయంలో ఆటగాళ్ల మధ్య పోటీ కూడా పెరిగిపోయిందని బుమ్రా అన్నాడు. ప్రతీ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించడం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారిందని, అది మంచి తలపోటేనని అన్నాడు. 

మెగా టోర్నీలో విజయాల పరంపర కొనసాగించడం మంచి పరిణామమని, దాంతో తమ క్రికెటర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని అన్నాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో జట్టు సభ్యులు ఆకట్టుకోవడంతోనే టాప్‌లో నిలిచామని అన్నాడు. ఇక తనపై పొగడ్తలను కానీ విమర్శలను కానీ సీరియస్‌గా తీసుకోనని ఒక ప్రశ్నకు సమాధానంగా బుమ్రా జవాబిచ్చాడు. 

కేవలం ఆటపైనే దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తనముందున్న లక్ష్యమని బుమ్రా చెప్పాడు. జట్టు కోసం తాను ఏమీ చేయగలనో దాని కోసం వంద శాతం కష్టపడుతానని చెప్పాడు. అదే సమయంలో బౌలింగ్‌ యూనిట్‌లో హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ షమీలు కూడా నిలకడగా వికెట్లు సాధించడం ఉపయోగపడిందని అన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios