టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ జోడి చాలా చూడ ముచ్చటగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరుస్తూనే ఉంటారు. తాజాగా కోహ్లీ.. అనుష్క పై చేసిన కామెంట్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు. 

ఇంతకీ మ్యాటరేంటంటే... వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రస్తుతం టీం ఇండియా ఇంగ్లాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఇటీవలే ఇండియన్ క్రికెటర్లకు తమ కుటుంబసభ్యులను కలుసుకునే అవకాశం కల్పించారు.ఈ క్రమంలో అనుష్క శర్మ లండన్ చేరుకుంది. కోహ్లీ మ్యాచ్ కోసం శ్రమిస్తుండగా... అనుష్క లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. 

లండన్ లో చక్కర్లు కొడుతూ ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి... ఆనందంగా ఉండే అమ్మాయిలు అందంగా ఉంటారు అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది. దీనికి విరాట్ రిప్లై చేశారు.

‘‘ నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు. మై లవ్’ అని కోహ్లీ ఇచ్చిన రిప్లై అభిమానులు ఫిదా అయిపోయారు. కోహ్లీ ఎంత క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy girls are the prettiest - Audrey Hepburn 🦋

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Jun 27, 2019 at 2:37am PDT