వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్-పాక్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధించడాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తమ ఆటగాళ్ల ఆటతీరు సరిగా లేకపోవడమే కారణంటూ తీవ్ర విమర్శలు  చేశారు. కాగా పాక్ క్రికెటర్లకు ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు.

మ్యాచ్ కి ఒక్కరోజు ముందు క్రికెటర్లు పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీంలు తిన్నారని... క్రికెటర్లు అలాంటి ఫుడ్ ఎక్కడైనా తింటారా.. క్రికెట్ కాకుండా కుస్తీ పోటీలకు వెళ్లాల్సింది అంటూ.. పాక్ క్రికెటర్లను ఓ అభిమాని తీవ్రంగా విమర్శించాడు. దీనిపై స్పందించిన హర్భజన్ ...తింటే తప్పేంటని ప్రశ్నించారు. ఆటగాళ్లు వారి ఇష్టమైన ఆహారన్ని తినవచ్చని అభిప్రాయపడ్డాడు. వారి ఆహారమే చెత్త ప్రదర్శనకు కారణమని చెప్పడం సరికాదన్నారు. మ్యాచ్‌కు ముందు రోజు పాక్‌ క్రికెటర్లు షికారు చేశారని, షోయబ్‌ మాలిక్‌ తన భార్య సానియా మీర్జా, ఇద్దరు సహచరులతో కలిసి ‘హుక్కా కేఫ్‌’లో ఉన్న ఫోటోలు వైరల్‌ అవ్వడంపై కూడా భజ్జీ స్పందించాడు.

‘అది నిజమో కాదో నాకు తెలియదు. ఒక వేళా అలా మ్యాచ్‌ ముందు రోజు షికారు చేయడం మంచిది కాదు. అది కూడా ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ అయితే అస్సలు అలాంటి పనిచేయకూడదు. అయితే.. అది నిజమని మాత్రం నేను అనుకోవడం లేదు.’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు. ఇక పాక్ సెమిస్ కి వెళ్లకపోతే.. కెప్టెన్ గా సర్ఫరాజ్ తప్పుకోవడం ఖాయమని భజ్జీ పేర్కొన్నాడు.