టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి ఎట్టకేలకు వరల్డ్ కప్ లో ఆడేందుకు అవకాశం లభించింది. మొదట జట్టుని ఎంపిక చేసిన సమయంలో తన పేరులేకపోవడంతో పంత్ చాలా నిరాశకు గురయ్యాడు. కాగా.. ఇప్పుడు మళ్లీ అవకాశం రావడంతో ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నాడు.ఈ సందర్భంగా పంత్ కి  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కొన్ని సూచనలు చేశాడు.

రిషబ్‌ పంత్‌కు ఇది సరైన అవకాశమని చెప్పాడు. పంత్‌ను ఉద్దేశిస్తూ బాగా ఆడుతున్నాడని మెచ్చుకున్నాడు. నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు ఇంతకన్నా పెద్ద అవకాశం మరొకటి ఉండదని సచిన్‌ తెలిపాడు. టీం ఇండియా ఓపెనర్ శిఖర్ థావన్ ఎడమ చేతికి గాయం కారణంగా వరల్డ్ కప్ నుంచి పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థావన్ స్థానంలో పంత్ కి అవకాశం కల్పించారు.

సచిన్.. పంత్ కి సూచనలు ఇవ్వడంతోపాుట... శిఖర్ థావన్ కి కూడా సూచనలు చేశాడు. ‘శిఖర్‌.. నీగురించి చింతిస్తున్నా. బాగా ఆడుతున్న సమయంలో ఇలాంటి పెద్ద టోర్నమెంట్‌లో గాయం కారణంగా నిష్క్రమించావు. ఇది చాలా బాధాకరమైన విషయం. నువ్వు  గతంలో కన్నా మరింత దృఢంగా తిరిగి వస్తావని ఆశిస్తున్నా’ అంటూ సచిన్‌ పేర్కొన్నాడు.