టీం ఇండియా చేతిలో పాక్ ఘోర పరాభవం చవిచూసింది. వరల్డ్ కప్ లో టీం ఇండియాను ఓడించాలని పాక్ చాలా ప్రయత్నించింది. కానీ.. ఓటమి మాత్రం తప్పలేదు. దీంతో... నెటిజన్లు... ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ ని విపరీరతంగా ట్రోల్ చేస్తున్నారు.

సర్పరాజ్‌  ఆట పేలవంగా ఉందని అతన్ని ఎగతాళి చేస్తూ ట్విట్టర్ లో పలువురు వ్యాఖ్యలు పెట్టారు. పాక్ జట్టు ఓటమిపై క్షణికావేశంలో టీవీలు పగులగొట్టే వారందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ పెట్టారు. ‘‘గుడ్ నైట్ కుర్రాళ్లు...అద్భుతమైన టీ కప్పుతో నన్ను మేల్కొలపండి...మ్యాచ్ విజేత ఎవరో నాకు చెప్పండి’’ అంటూ ఓ నెటిజన్ అర్దరాత్రి జరిగిన మ్యాచ్ పై కామెంట్ పెట్టారు. 

మ్యాచ్ సందర్భంగా వర్షం కురిసి తగ్గడంతో ఓ క్రికెట్ అభిమాని ‘‘చలో చలో బారిష్ రుక్ గయీ...గేమ్ షురు కర్తే హై’’ అంటూ ట్వీట్ చేశారు. పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్‌ ఎందుకు బ్యాట్ పట్టాడు అంటూ పాక్ నెటిజన్ ప్రశ్నించారు. మొత్తంమీద పాక్ ఘోర పరాజయంతో పాక్ వాసులు క్రికెట్ జట్టు కెప్టెన్ సర్పరాజ్‌తోపాటు జట్టుపై అగ్రహావేశాలు వ్యక్తం చేశారు.