Asianet News TeluguAsianet News Telugu

ఇండియానే ఫేవరేట్.. కానీ ఓడిపోతామని అనుకోవద్దు: ఇమ్రాన్ ఖాన్ ట్వీట్

దాయాది దేశంతో పోరు సందర్భంగా పాకిస్తాన్‌ జట్టుకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పలు సూచనలు చేశారు. 

Pakistan Prime Minister imran khan motivational tweets for safaraj ahmed
Author
Islamabad, First Published Jun 16, 2019, 3:38 PM IST

దాయాది దేశంతో పోరు సందర్భంగా పాకిస్తాన్‌ జట్టుకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పలు సూచనలు చేశారు. ఓడిపోతామనే భావన తొలగించి పట్టుదలగా రాణించడంపైనే దృష్టిసారించండి.

ఓడిపోతామనే భయమే మరింత ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. దాని వల్ల ప్రత్యర్థుల నుంచి జరిగే పొరపాట్లను అందిపుచ్చుకునే అవకాశం కోల్పోయే ప్రమాదముంది.

పాకిస్తాన్ గెలవాలంటే సర్ఫరాజ్ సేన అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్‌ అటాక్‌తో బరిలోకి దిగాలి. పిచ్ పరిస్థితిని బట్టి సర్ఫరాజ్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిందని ఇమ్రాన్ సూచించాడు.

అంతేకాకుండా తాను క్రికెట్‌ ఆరంభించిన తొలి రోజుల్లో విజయమంటే 70 శాతం నైపుణ్యం, 30 శాతం ఆలోచనా శక్తి అనుకునేవాణ్ణి.. రిటైర్మెంట్ తర్వాత దానిని 50-50గా భావించానని... అయితే తన మిత్రుడు గవాస్కర్ చెప్పినట్లు 60 శాతం మానసిక ఒత్తిడి, 40 శాతం నైపుణ్యం.. ఇవాళ్టీ మ్యాచ్‌లో రెండు జట్లు చాలా ఒత్తిడికి గురవుతాయి. అయితే ఆలోచనా శక్తి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది.

సర్ఫరాజ్ కెప్టెన్‌గా ఉండటం మా అదృష్టం... ఇవాళ అతను అత్యంత ధైర్యంగా పోరాడాల్సిన అవసరముందని ఇమ్రాన్ సూచించారు. దేశ ప్రజలందరి ప్రార్థనలు మీ వెంటే ఉన్నాయి.. గుడ్ లక్ అని ఇమ్రాన్ పాక్ జట్టుకు స్ఫూర్తిదాయక ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios