Asianet News TeluguAsianet News Telugu

చేతులెత్తేసిన పాక్: 89 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో పాకిస్తాన్ చేతులెత్తేసింది. ఇండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టడంతో భారత్ 336 పరుగులు చేయగలిగింది.

Pak won the toss and choose field
Author
Manchester, First Published Jun 16, 2019, 2:54 PM IST

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ చేతులెత్తేసింది. పాక్ పై భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాల్సి ఉండగా ఆరు వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది. ఇమద్ వసీం 46 పరుగులతో, షాదాబ్ ఖాన్ 20 పరుగులతో నాటౌట్ గా మిగిలారు.

భారత బౌలర్లలో విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఎడమ మోకాలు వద్ద కండరం మెలితిప్పడంతో భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు..అద్భుతమైన సెంచరీ సాధించిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అతను 113 బంతుల్లో 140 పరుగులు చేశాడు.

వర్షం తెరిపిని ఇవ్వడంతో పాకిస్తాన్, భారత్ మధ్య ఆట తిరిగి ప్రారంభమైంది. అయితే, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండిన స్థితి. 30 బంతుల్లో పాకిస్తాన్ 136లు చేయాలని నిర్దేశించారు. ఇన్నింగ్సును 40 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్దేశించారు.

పాకిస్తాన్ 35 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మరోసారి ఆట నిలిచిపోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ ఇప్పటికి 252 పరుగులు చేయాల్సి ఉండింది. ఆ పద్ధతి ప్రకారం చూస్తే పాకిస్తాన్ 86 పరుగుల వెనకంజలో ఉంది. ఇక ఆట తిరిగి కొనసాగి భారత్ విజయం సాధించింది..

భారత్ తమ ముందు ఉంచిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 165 పరుగుల స్కోరు వద్ద ఆరో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విజయ్ శంకర్ బౌలింగ్ లో సర్ఫరాజ్ అహ్మద్ ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. అతను 30 బంతులు ఆడి కేవలం 12 పరుగులు చేశాడు.అంతకు ముందు హార్జిక్ పాండ్యా రెండో వికెట్ తీశాడు. 129 పరుగుల స్కోరు వద్దనే పాకిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. షోయబ్ మాలిక్ డకౌటయ్యాడు.

పాక్ 129 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను జారవిడుచుకుంది.మొహమ్మద్ హఫీజ్ 7 బంతుల్లో 9 పరుగులు చేసి హార్జిక్ పాండ్యా బౌలింగులో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.పాకిస్తాన్ 126 పరుగుల స్కోరు వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీశాడు.కుల్దీప్ యాదవ్ బౌలింగులో చాహల్ కు క్యాచ్ ఇచ్చి ఫకర్ జమాన్ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

ఎట్టకేలకు ఇండియాకు కొంత ఊరట లభించింది. 117 పరుగుల వద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. బాబార్ ఆజం 57 బంతుల్లో 48 పరుగులుచేసి కుల్దీప్ యాదవ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.పాకిస్తాన్ 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఇమామ్ ఉల్ హక్ విజయ్ శంకర్ బౌలింగులో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. 

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో భారత్ పాకిస్తాన్ పై భారీ స్కోరు చేసింది. ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రోహిత్ శర్మ భారీ సెంచరీతో అదరగొట్టాడు. వర్షం తెరిపి ఇచ్చిన తర్వాత ఆట తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుటయ్యాడు.65 బంతుల్లో 77 పరుగులు చేసి మొహమ్మద్ అమీర్ బౌలింగులో అవుటయ్యాడు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అమీర్ మూడు వికెట్లు తీయగా, వాహబ్, హసన్ లకు చెరో వికెట్ దక్కింది.

అనుకున్నట్లుగానే భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి కలిగించింది. భారత ఇన్నింగ్సు ముగియడానికి మరో 4 ఓవర్లు ఉండగా భారీ వర్షం కురియడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆట ఆగిన సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది.

దాయాది దేశంతో పోరులో భారత్ జూలు విదిల్చింది. ఆకాశమే చెలరేగిన భారత ఆటగాళ్లు పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వేసిన పునాదిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్బుతమైన ఇన్నింగ్సును నిర్మించాడు.ముఖ్యంగా రోహిత్ ధాటిగా ఆడి కెరీర్‌లో 24వ సెంచరీని నమోదు చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డిక్ కాసేపు మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనించింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి శంకర్ 3, కోహ్లీ 71 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. అనుభవజ్ఞుడైన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని పాక్ బౌలర్ అమిర్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. 1 పరుగు చేసిన ధోని వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.హార్డ్ హిట్టర్ పాండ్యా వికెట్‌ను భారత్ కోల్పోయింది. 19 బంతుల్లో రెండు ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 పరుగులు చేసిన పాండ్యా ధాటిగా ఆడాడు. అమీర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బాబర్ ఆజామ్‌కు క్యాచ్ ఇచ్చి హార్డిక్ వెనుదిరిగాడు.

కోహ్లీ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో అర్థసెంచరీ చేసిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు ఉన్నాయి. రోహిత్‌కు స్ట్రైక్ రోటేట్ చేస్తూ సింగిల్స్ తీసిన కోహ్లీ... వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. దూకుడుగా ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 113 బంతుల్లో 140 పరుగులు చేసిన రోహిత్ భారత ఇన్నింగ్సు‌కు వెన్నెముకగా నిలిచాడు. 140 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. 

దాయాదితో మ్యాచ్‌లో పాక్ దూకుడుగా . 35వ ఓవర్‌లోనే 200 పరుగులు పూర్తి చేసుకుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడుతుండగా.. కెప్టెన్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. 35 ఓవర్లు ముగిసే సరికి రోహిత్ 119, కోహ్లీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

టీమిండియా 150 పరుగులు పూర్తి చేసుకుంది. రోహిత్ శర్మ ధాటిగానే ఆడుతుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ కుదురుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 151 పరుగులు చేసింది. 

భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రియాజ్ బౌలింగ్‌లో బాబర్ ఆజామ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు స్ట్రైక్ రోటేట్ చేస్తూ ఆడిన అతను 70 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.

భారత్ 100 పరుగుల మార్క్‌ను దాటింది. ఓపెపర్లు నిలకడగా రాణిస్తున్నారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ బౌలర్లను మార్చి మార్చి బంతులు వేయిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 18 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 101 పరుగులు చేసింది. రాహుల్ 37, రోహిత్ 61 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 34 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. భారత్ 50 పరుగుల మార్క్‌ను దాటింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నప్పటికీ, భారత ఓపెనర్ రోహిత్ శర్మ దూకుడుగానే ఆడుతూ వచ్చాడు. భారత్ 11 ఓవర్లకు 66 పరుగులు చేసింది.

భారత జట్టు:

1. రోహిత్ శర్మ,
2. లోకేశ్ రాహుల్
3. విరాట్ కోహ్లీ
4. విజయ్ శంకర్
5. ధోనీ
6. కేదార్ జాదవ్
7. హార్డిక్ పాండ్యా
8. భువనేశ్వర్ కుమార్
9. కుల్‌దీప్ యాదవ్
10. చాహల్
11. బుమ్రా

పాక్ జట్టు:
1. ఇమామ్ ఉల్ హక్
2. ఫకార్ జామాన్
3. బాబర్ ఆజామ్
4. మహ్మద్ హాఫీజ్
5. సర్ఫరాజ్ అహ్మద్
6. షోయాబ్ మాలిక్
7. ఇమాద్ వాసిమ్
8. షాదాబ్ ఖాన్
9. హసన్ అలీ
10. వాహబ్ రియాజ్
11. మహమ్మద్ అమీర్

ధావన్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ని తుది జట్టులోకి తీసుకున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ - పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios