మిస్టర్ కూల్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 38వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలువురు ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా... వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా ఉన్నారు.  అందరిలా మామూలు బర్త్ డే విషెస్ కాకుండా... కొంచెం స్పెషల్ గా విషెస్ చెప్పాడు. దీంతో... ఆ విషెస్ పై న్యూజిలాండ్ కెప్టెన్ గ్యారీ స్పందించారు.

‘‘ పుట్టిన రోజు శుభాకాంక్షలు ధోనీ. వరల్డకప్ లో మీరు ఆడాల్సిన రెండు మ్యాచ్ లకు ఆల్ ది బెస్ట్’’ అంటూ  సచిన్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి ధోనీతో కలిసి దిగిన ఫోటోని జత చేశాడు. పుట్టిన రోజు విషెస్ తోపాటు.. టీం ఇండియా కచ్చితంగా ఫైనల్ కి చేరుతుంది అనే ఆశాభావాన్ని సచిన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ తో గెలిచి ఫైనల్స్ కి చేరుతుందని.. ఆ రెండు మ్యాచ్ లకు సచిన్ ఈ సందర్భంగా ధోనికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

కాగా... దీనిపై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్పందించాడు.  ధోనీ ఆ రెండు మ్యాచ్ లు ఆడతాడని తాను కూడా భావిస్తున్నానని చెప్పాడు. అయితే... అది నిజంగా జరుగుతుందో లేదో మాత్రం తనకు లేదన్నాడు. మా జట్టు కుర్రాళ్లది కూడా త్వరలో పుట్టిన రోజు రాబోతోంది. వాళ్లకు కూడా ఇలాంటి విషెస్ వస్తాయని భావిస్తున్నాను అంటూ న్యూజిలాండ్ కోచ్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే... వరల్డ్ కప్ లో టీం ఇండియా, న్యూజిలాండ్ టీంలు తొలిసారి తలపడుతున్నాయి. గతంలో వర్షం కారణంగా వీరి మ్యాచ్ రద్దు అయ్యింది. మంగళవారం జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మరి ఏం జరగనుందో  తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.