ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం టీం ఇండియా... ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తొలిసారిగా భారత్ ఆరెంజ్ కలర్ జెర్సీని ధరించనుంది. ఇప్పటికే జెర్సీ ఎలా ఉండబోతోందో ఇప్పటికే ఫోటో విడుదల చేశారు. ఆటగాళ్లు ఆ జెర్సీల్లో దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. కొందరు జెర్సీ చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తుండగా... కొందరు మాత్రం అస్సలు బాలేదంటూ విమర్శిస్తున్నారు. కొందరైతే జోకులు పేలుస్తున్నారు.

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీని చూసి జెర్సీ తయారు చేశారంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. ఇంకొంరేమో హార్లిక్స్ డబ్బాలాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  కొందరు మాత్రం చాలా బాగుందని... దీనినే ఎప్పటికీ కంటిన్యూ చేయండని సూచిస్తున్నారు.

భారత్, ఇంగ్లండ్‌ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు  ఆరెంజ్ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆతిథ్య జట్టు కావడంతో అదే జెర్సీతో బరిలోకి దిగుతుంది.