మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంత ఒత్తిడిలో ఉన్నా కూల్‌గా ఉంటూ వ్యూహా ప్రతివ్యూహాలతో ప్రత్యర్ధిని చిత్తు చేసే నేర్పరి. వీటన్నింటికి మించి అభిమానులు ధోనిలో ఇష్టపడేది కీపింగ్.

ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ధోనీ కీపింగ్ చేస్తుండగా ఎవరైనా క్రీజు వదిలారో అంతే సంగతులు.. రెప్పపాటులో బంతి వికెట్లును గీరాటేస్తుంది. అలా ఎంతోమందిరి వెనక్కిపంపి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

అలాంటి ధోనీ స్టంపౌట్‌‌గా వెనుదిరిగితే.. ప్రపంచకప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీని రషీద్ ఖాన్ బోల్తా కట్టించాడు. 45వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చిన ధోనికి బంతి చిక్కకుండా నేరుగా కీపర్ చేతుల్లో పడింది.

దీనిని గుర్తించిన ధోనీ వెనక్కి వచ్చేసరికి కీపర్ వికెట్లను గీరాటేశాడు. కాగా వన్డే కెరీర్‌లో ధోని స్టంప్ ఔటవ్వడం రెండోసారి. అంతకు ముందు 2011 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ తొలిసారి స్టంపౌటయ్యాడు.