ఎప్పుడు ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. ప్రపంచకప్ లో భాగంగా ఇటీవల టీం ఇండియా ఆప్గనిస్తాన్ తో పోటీ పడింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా కొద్ది పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే... ఈ మ్యాచ్ లో ధోనీ ఆటపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. విమర్శలు కెప్టెన్ కూల్ పై విమర్శల దాడి చేశారు. కాగా... ఆ విమర్శలకు తాజాగా కోహ్లీ సమాధానం ఇచ్చారు.

గురువారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయానికి ధోనీ సహకరించాడు. ఈ క్రమంలో  ధోనీపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.  ఏ మ్యాచ్ ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసని చెప్పాడు. ఏదో ఒక్కరోజు సరిగా ఆడకపోతే అతనిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. కానీ ధోనికి తాను మద్దతుగా ఉన్నట్లు చెప్పాడు.క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు కావాల్సిన పరుగులను ధోనీ అలవోకగా సాధిస్తాడని కోహ్లీ అన్నాడు. ధోని అనుభవంలో ఇలాంటి పది సందర్భాల్లో 8సార్లు విజయం సాధించాడని గుర్తు చేశాడు. 

‘‘పిచ్‌ పరిస్థితులను బట్టి 265 పరుగులు మంచి స్కోర్‌ అని ధోని చెబితే.. మేం 230కే పరిమితమవుతాం. అతను మాకు దిగ్గజం. తను ఇలానే రాణిస్తాడని ఆశిస్తున్నాను. గత రెండు మ్యాచ్‌ల్లో మా వ్యూహాలు సరిగ్గా అమలు కాలేదు. కానీ మేం గెలుపు దిశగా పయనించాం. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలుస్తామని ఫీలవుతున్నాం. అఫ్గాన్‌ మ్యాచ్‌ పరిస్థితులు ఈ మ్యాచ్‌లో ఎదురయ్యాయి. కానీ హార్దిక్‌ పాండ్యా, ధోని అద్భుతంగా ఆడారు. 270 పరుగుల చేయడం ఈ పిచ్‌పై చాలా కష్టం‌’’ అని ధోనికి మద్దతుగా నిలిచాడు.