శ్రీలంక సీనియర్ క్రికెటర్ మలింగ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక ప్రస్తుతం బంగ్లాదేశ్ తో మ్యాచ్ కోసం సన్నద్దమౌతోంది. ఇలాంటి సమయంలో మలింగ అత్త చనిపోయారనే విషాద వార్త వినాల్సి వచ్చింది. మంగళవారం బంగ్లాద్ తో శ్రీలంక తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ మ్యాచ్ అనంతరం మలింగ స్వదేశానికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

మలింగ అత్త కాంతీ పెరీరా అంత్యక్రియలను గురువారం కొలంబోలో నిర్వహించనున్నారు.ఈ అంత్యక్రియల అనంతరం మలింగ తిరిగి జట్టులో జాయిన్ కానున్నారు.  వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన లంక అప్గనిస్థాన్‌పై మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. నేడు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.