లండన్: ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ కు చేరుకునే జట్లు ఏవనే విషయాన్ని ఇంగ్లాండు మాజీ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ అంచనా వేసి చెప్పాడు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. 

రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లాైండు ఆస్ట్రేలియాను ఓడిస్తుందని కెవిన్ పీటర్సన్ అన్నాడు. అంతటితో ఆగకుండా ఫైనల్ మ్యాచులో ఆదివారంనాడు లార్డ్స్ మైదానంలో ఇండియా, ఇంగ్లాండు తలపడుతాయని చెప్పాడు. 

ఇండియా 9 మ్యాచులు ఆడి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఇంగ్లాండుపై మాత్రమే ఓడిపోయింది. న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇంగ్లాండులపై ఓడిపోయి 11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. 

దక్షిణాఫ్రికాపై ఓడిపోయి ఆస్ట్రేలియా అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి దిగజారింది. తొలుత బాగా ఆడిన ఇంగ్లాండు తర్వాత శ్రీలంక, ఆస్ట్రేలియాలపై ఓడిపోయి కష్టాల్లో పడింది. ఇండియా, న్యూజిలాండ్ లపై గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.