వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు సెమిస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే..సెమిస్ కి వెళ్లే అవకాశం లేకుండా పోయేది. అలాంటి క్లిష్టమైన మ్యాచ్ ని గెలిచి సెమిస్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే.. ఈ మ్యాచ్ గెలిచినా కూడా నెటిజన్లు ట్రోల్ చేయడం గమనార్హం.

వికెట్ తీసిన తర్వాత మైదానంలో కలియతిరుగుతూ సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ సంబరాలు చేసుకోగా.. పాకిస్థాన్ ఫీల్డర్లు పదే పదే క్యాచ్‌లు వదిలేయడంపై సెటైర్లు కురిపిస్తున్నారు. ఇక భారత్‌పై మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ ఆవలింతలు తీసి విమర్శలు ఎదుర్కొన్న పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్.. ఈ మ్యాచ్‌లో సైలెంట్‌గా ఉన్నా.. అభిమానులు మాత్రం వదల్లేదు. 

పాక్ మ్యాచ్ గెలవడం మిరాకిల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ సర్ఫరాజ్ గతంలో ఆవలిత ఫోటోని.. ఈ మ్యాచ్ లో నార్మల్ గా ఉన్న ఫోటోలను రెండింటినీ జత చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వికెట్ తీసిన ఆనందంలో తాహిర్ పరుగులుపెడుతూ లాహోర్ వెళ్లాడంటూ సెటైర్లు వేయడం గమనార్హం. మ్యాచ్ గెలిచినా కూడా పాక్ కి ట్రోల్స్ మాత్రం తప్పడం లేదు.