Asianet News TeluguAsianet News Telugu

ధోనీ రికార్డును బ్రేక్ చేయనున్న రోహిత్..?

టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు కి చేరువలో ఉన్నాడు. రోహిత్ కనుక రెండు సిక్సర్లు చేస్తే... టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బ్రేక్ చేస్తాడు. 

india vs west indies, world cup 2019, rohith sharma 2 big hits way from breaking dhoni odi record
Author
Hyderabad, First Published Jun 27, 2019, 1:54 PM IST

టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు కి చేరువలో ఉన్నాడు. రోహిత్ కనుక రెండు సిక్సర్లు చేస్తే... టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రికార్డును బ్రేక్ చేస్తాడు.  అంతేకాదు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు చేసిన బ్యాట్స్ మెన్ రోహిత్ నిలుస్తాడు.

210 వన్డేలు ఆడిన రోహిత్‌ ఇప్పటివరకు 224 సిక్సర్లు బాదాడు. మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఖాతాలో 225 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది(351 సిక్సర్లు), వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌(324 సిక్సర్లు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ సనత్ జయసూర్య 270 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 250 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో టాప్‌-5లో నిలిచిన ఒకే ఒక్కడు రోహిత్‌ కావడం విశేషం.

టెస్ట్‌, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లను కలిపి చూస్తే ధోని కంటే రోహిత్‌ శర్మ కొట్టిన సిక్సర్లు ఎక్కువగా ఉన్నాయి. 358 సిక్సర్లతో రోహిత్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ధోని 355 సిక్సర్లు కొట్టాడు. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ శర్మ భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.

ప్రపంచకప్ లో భాగంగా నేడు టీం ఇండియా వెస్ట్ ఇండీస్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రోహిత్.. ధోనీ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios