ప్రపంచకప్ హోరులో టీం ఇండియా సెమి ఫైనల్స్ కి చేరుకుంది. నేటి మ్యాచ్ తో ఫైనల్స్ కి చేరుతుందా లేదా అన్న విషయం తెలియనుంది. అయితే... ప్రస్తుతం టీం ఇండియాకు ఆల్ రౌండర్ కేదార్ జాదవ్ అసవరం ఏంతో ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జాదవ్‌కు కివీస్‌పై మంచి బౌలింగ్‌ రికార్డు ఉందని, అది జట్టుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కివీస్‌ టాప్‌ బ్యాట్స్‌మెన్‌ అంతా జాదవ్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడ్డారని, జాదవ్‌ కివీస్‌పై 9 వికెట్లు పడగొట్టాడని గుర్తు చేస్తున్నారు.

మరికాసేపట్లో టీం ఇండియా సెమీ ఫైనల్స్ లో భాగంగా కివీస్ తో తలపడనుంది. అయితే... ఈ మ్యాచ్ జరిగే పిచ్ కూడా స్పిన్ కి బాగా సహకరిస్తుందని..నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పిన్నర్ గా దినేశ్ కార్తీక్ కన్నా కూడా జాదవ్ ని తీసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. మరి సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి. ఇదిలా ఉంటే... అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకుంటే ప్రస్తుతం అక్కడ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.