టీం ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ తర్వలోనే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలకనున్నారని వార్తలు వెలువుడుతన్నాయి.ధోనికి ఇదే చివరి వరల్డ్ కప్ అని.. సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత తన రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తాడని కూడా వార్తలు వచ్చాయి.   తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటానో తనకే తెలీదని ధోనీ చెప్పినా.. ఈ వార్తలకు పులిస్టాప్ పడటం లేదు. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.

ధోనీ తన రిటైర్మెంట్ గురించి కానీ, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి గానీ తమలో ఎవరికీ  ఏమీ చెప్పలేదని కోహ్లీ అన్నాడు. అనంతరం నిన్నటి మ్యాచ్ గురించి కూడా కోహ్లీ స్పందించాడు.  జడేజా బాగా ఆడుతున్నాడని... అతనికి సరైన జోడి ఉంటే... జట్టు స్కోరు పరుగులు తీస్తుందని తాను భావించినట్లు కోహ్లీ చెప్పాడు. జడేజాకి ధోనీ లాంటి జోడి ఉంటే గేమ్ గెలిచే అవకాశం ఉందని భావించినట్లు చెప్పాడు. 

న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ని చేధించే క్రమంలో తొలుతే వికెట్లు కోల్పోయామని...ఈ క్రమంలో జట్టుని నిలబెట్టాలంటే.. జడేజా, ధోనీ జోడినే కరెక్ట్ అని తనకు అనిపించిందని కోహ్లీ అన్నాడు. ప్రపంచకప్ లో కొన్ని మ్యాచుల్లో ధోనీ సరిగా ఆడి ఉండకపోవచ్చు... కానీ... టీం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ధోనీ అండగా నిలుస్తాడని కోహ్లీ తెలిపాడు.