టీమిండియా అభిమానులకు షాకింగ్ న్యూస్.. ఈ నెల 13న జరగనున్న భారత్ -న్యూజిలాండ్ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు పొంచి వుంది. గత రెండు రోజులుగా ట్రెంట్ బ్రిడ్జిలో వర్షం కురుస్తోంది..

ఈ పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ వారంతం వరకు బర్మింగ్‌హామ్, పీటర్‌బొరో, న్యూ క్యాజిల్ సహా ఇంగ్లాండ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది.

భారీగా వర్షపు నీరు ముంచెత్తి వరదులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా హ్యాట్రిక్ విజయాలతో న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలను ఓడించి భారత్ జోరుగా ఉండటంతో గురువారం హోరాహోరీ పోరు జరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ మ్యాచ్‌కు మరి వరుణుడు అడ్డుతొలగుతాడో లేదో వేచి చూడాలి.