మాంచెస్టర్: ఇరు జట్ల మధ్య ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ధీటుగా జవాబిచ్చాడు. కానే విలియమ్సన్, రాస్ టైలర్ వికెట్లు తమకు కీలకమని కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించాడు.

తాను కేంద్ర బిందువుగా ఉండదలుచుకోలేదని కానే విలియమ్సన్ అన్నాడు. గత కొన్నేళ్లుగా చాలా మంది తమ ఆటగాళ్లు తగిన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారని, మ్యాచ్ లో విజయం సాధించడానికి తాము చాలా ముందుకు సాగి వచ్చామని చెప్పాడు. అదే అదృష్టం తమను ఈ మ్యాచులో వరిస్తుందని ఆయన అన్నాడు.ట

ఇండియాపై తాము అండర్ డాగ్స్ గా అడుగు పెడుతునందుకు ఏ విధమైన అభ్యంతరం లేదని అన్నాడు. తాము మ్యాచులో ఏ విధంగా అడుతాం, తమ ప్లాన్స్ ఏ విధంగా అమలు చేస్తాం అనేవే ఇక్కడ ముఖ్యమవుతాయని అన్నాడు. 

చాలా సందర్భాల్లో ప్రతి జట్టు మరో జట్టును ఓడించినవే ఇక్కడ ఉన్నాయని ఆయన అన్నాడు. ఇది సెమీ ఫైనల్ కాబట్టి కొన్ని అదనపు బయటి పరిస్థితుల్లో కొంత తేడా ఉండవచ్చునని అన్నాడు. 

పరిస్థితులను అంచనా వేయడంపై అంతా ఆధారపడి ఉంటుందని, అద్భుతమైన ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను తాము లక్ష్యంగా చేసుకుంటామని విలియమ్సన్ చెప్పాడు. ఓ టోర్నీలో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని, బౌలింగ్ యూనిట్  ఏం చేయాలనేది తాము ఆలోచిస్తామని అన్నాడు.