ప్రపంచకప్ టోర్నమెంట్ లో గురువారం మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ వివాదాస్పదంగా అవుట్ అయ్యారు. దీనిపై రోహిత్ శర్మ ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో బంతి తన బ్యాట్‌కు తాకకున్నా కూడా మూడో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించారని రోహిత్ శర్మ పేర్కొన్నారు. బంతికి, బ్యాట్‌కు మధ్య దూరం స్పష్టంగా కనిపించేలా ఉన్న ఫోటోను అతను ట్విట్టర్‌లో శుక్రవారం పోస్టు చేశాడు. ఆ ఫోటోలో బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోటోని షేర్ చేసి.. దీనిని మీరు ఔట్ అంటారా అని నెటిజన్లను ప్రశ్నించారు.

కాగా రోహిత్ పెట్టిన పోస్టుకి నెటిజన్ల నుంచి మద్దతు లభించింది. దీనిపై కూడా నెటిజన్లు మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం. ఈ పోస్టు చూసిన వెంటనే కబీర్ సింగ్ లో షాహిద్ బైక్ పె వెళ్లినట్లు గా కోహ్లీ వెళ్తున్నట్లు.. ఫోటో షాప్ లో  ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు.