వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకి షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో ఫేవరేట్ టీంగా బరిలోకి దిగిన  న్యూజిలాండ్  కి ఐసీసీ జరిమానా విధించింది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ స్లో ఓవర్ రేట్ తో ఆడింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చర్యలు తీసుకుంది.

నిర్ణీత సమయంలో కన్నా ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాచ్ ఫీజులో 20శాతం, తుది జట్టు సభ్యులకు 10శాతం కోత విధించారు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేయడంతో మ్యాచ్ రిఫరీ కెప్టెన్ నుంచి వివరణ కోరగా అతడు తప్పును అంగీకరించాడు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో విండీస్‌పై కివీస్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ 148 పరుగులతో కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు.