నేను చిన్నప్పటి నుంచే అంతే అంటున్నాడు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. రీసెంట్ గా... కోహ్లీ తన చిన్ననాటి ఫోటో ఒకటి షేర్ చేశాడు. కాగా... ఆ ఫోటో వైరల్  గా మారింది. తన చిన్ననాటి ఫోటోకి.. ప్రస్తుతం ఫోటోని జత చేసి మరీ షేర్ చేశాడు కోహ్లీ. కాగా... విశేషం ఏమిటంటే... ఆ రెండు ఫోటోల్లో కోహ్లీ ఒకేరకమైన ఫోజు ఇచ్చాడు.

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ వర్షం కోసం ఎదురు చూసే ఫోజిచ్చాడు. అందులో నడుముపై రెండు చేతులు ఆనించి మబ్బులవైపు చూస్తున్నాడు. అదే ఫోటోతో పాటు తన చిన్నప్పటి అదే ఫోజులోని మరో ఫొటోని జతచేశాడు. ‘1990ల నాటి నుంచి ఇదే చేస్తున్నా’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

కాగా.. పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా 89 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్‌శర్మ(140) అద్భుత శతకంతోపాటు కోహ్లీ (77), కేఎల్‌ రాహుల్‌(57) అర్ధశతకాలతో రాణించడంతో భారత్‌ తొలుత 336/5 పరుగులు చేసింది.