Asianet News TeluguAsianet News Telugu

భారత్-పాక్ మ్యాచ్‌ను వదిలేది లేదంటున్న వరుణుడు

ప్రపంచకప్‌-2019కే అత్యంత ఆకర్షణగా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మ్యాచ్‌లన్నీ ఏకపక్షం కావడం, నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దుకావడంతో దాయాదుల పోరుపై ఆసక్తి నెలకొంది

heavy rain alert to india vs pakistan match
Author
Manchester, First Published Jun 16, 2019, 12:55 PM IST

ప్రపంచకప్‌-2019కే అత్యంత ఆకర్షణగా నిలవనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే మ్యాచ్‌లన్నీ ఏకపక్షం కావడం, నాలుగు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దుకావడంతో దాయాదుల పోరుపై ఆసక్తి నెలకొంది.

అయితే మ్యాచ్‌కు వరుణుడు అడ్డు కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు వాతావారణ శాఖ అధికారులు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో వర్షం లేదు.. కానీ దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం జోరుగా కురిసే అవకాశం ఉందని బ్రిటన్‌లోని వాతావరణ ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి.

ఒక నివేదిక ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి చిరుజల్లులు ప్రారంభమై... మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఈ వార్తలతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios