వరల్డ్ కప్ లో భాగంగా గత ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఘోరంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో పాక్ జట్టు సభ్యులపై ఆ దేశ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మ్యాచ్ జరిగా ఐదు రోజులు అయినా.. ఇంకా పాక్ క్రికెటర్లపై విమర్శలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ తాను చేసిన ట్వీట్‌ దుమారం రేపడంతో అతను వార్తల్లో నిలిచాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే... భారత్-పాక్ మ్యాచ్ తర్వాత ఆజ్ తక్ టీవీ ఛానెల్ విలేకరి ముంతాజ్ ఖాన్..‘అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన టీమ్‌ ఇండియాకు కంగ్రాట్స్, వరల్డ్‌కప్‌ గెలవాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్‌  చేశారు. ‘మీ ఆకాంక్ష నెరవేరుతోంది, కంగ్రాట్స్‌’ అంటూ హసన్‌ అలీ ఆమెకు రిప్లై ఇచ్చాడు. అయితే అభిమానుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. 

ఇండియా చేతిలో మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా వరల్డ్ కప్ కూడా ఆ జట్టుకే వస్తుందని ట్వీట్ చేస్తావా అంటూ... అలీపై నెటిజన్లు విపరీతంగా మండిపడ్డారు. ఈ విమర్శల తాకిడి మరింత ఎక్కువ కావడంతో..అలీ తాను చేసిన ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.