Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ ఎంత చేశాడో.. బుమ్రా కూడా అంతే: వాళ్లిద్దరే హీరోలన్న సచిన్

బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతూ జట్టు విజయాల్లో బుమ్రా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా బుమ్రాను ఆకాశానికెత్తేశాడు. 

farmer team india cricketer sachin tendulkar paises jasprit bumrah
Author
London, First Published Jul 8, 2019, 12:17 PM IST

ఈ ప్రపంచకప్‌‌లో భారత జట్టు ప్రధాన బలం జస్ప్రీత్ బుమ్రా. పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెడుతూ జట్టు విజయాల్లో బుమ్రా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతనిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా బుమ్రాను ఆకాశానికెత్తేశాడు. అద్బుత విజయాలతో టీమిండియా సెమీఫైనల్ చేరుకోవడానికి రోహిత్ం శర్మ‌తో సమానంగా బుమ్రా కష్టపడ్డాడని పేర్కొన్నాడు.

 అయితే వికెట్లు తీయడంలో కొంచెం ఇబ్బంది పడుతున్న బుమ్రా టీమిండియా విజయాల్లో మాత్రం తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాడని కొనియాడాడు.

ఇక కీలకదశలో బుమ్రా రాణించనిపక్షంలో టీమిండియా వద్ద మరేదైనా ప్లాన్ ఉందా అన్న ప్రశ్నకు... సచిన్ బదులిస్తూ.. బుమ్రా వికెట్లు తీయకపోయినా.. జట్టు విజయానికి అవసరమైన విధంగా బౌలింగ్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఈ టోర్నీలో ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.. అయితే లంకతో మ్యాచ్‌లో మాత్రం 3 కీలక వికెట్లు తీశాడని టెండూల్కర్ గుర్తు చేశాడు. ఇక ప్రపంచకప్‌లో 17 వికెట్లు తీసిన బుమ్రా బౌలర్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్ అగ్రస్థానంలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios