టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. షమీ తనకు మెసేజ్ చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

కొద్ది నెలల క్రితం షమీ గురించి అతని భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. షమీకి చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది.  ఈ వ్యవహారంలో షమీపై పోలీసులు చార్జ్‌షీట్‌ కూడా నమోదు చేశారు. అతని క్రికెట్‌ కెరీర్‌ నాశనం చేసేలా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా జహాన్‌ ఆరోపించింది. ముందుగా షమీకి కాంట్రాక్ట్‌ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచకప్ లో భాగంగా టీమీండియా తరపున ఆడుతున్నాడు. 

కాగా... తాజాగా మరోసారి షమీపై అలాంటి ఆరోపణలే వచ్చాయి.  ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘1.4 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న గొప్ప క్రికెటర్‌ నాకే ఎందుకు మెసేజ్‌ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్‌ స్క్రీన్‌ షాట్స్‌ జత చేసి ప్రశ్నించింది. 

అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌’ అని మెసేజ్‌ చేసినట్లు ఆ స్క్రీన్‌ షాట్స్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం సోఫియా పోస్ట్‌పై భిన్నభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీ చేసిన మెసేజ్‌లో తప్పేం ఉందని ప్రశ్నిస్తూ మద్దుతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతను నిజంగా స్త్రీలోలుడేనని తప్పుబడుతున్నారు. ఒంటరిగా ఉండలేక మెసేజ్‌ చేసినట్లున్నాడని మరికొందరు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.