ప్రపంచకప్ హోరులో ఆస్ట్రేలియా ముందుకు దూసుకుపోతోంది. గురువారం బంగ్లాదేశ్ తో తలపడిన ఆస్ట్రేలియా మరో విజయం సాధించి తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ గెలవడంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 నేను సెంచరీ చేసిన దాని కంటే ఈ గెలుపుతో మా జట్టుకు లభించిన 2 పాయింట్లతో  పట్టికలో అగ్రస్థానానికి చేరడం నాకు సంతోషాన్ని కలిగించింది. మ్యాచ్‌ ఆరంభంలో బంగ్లా బౌలర్లు కొత్త బాల్‌తో బాగానే ఇబ్బంది పెట్టారు. అటువంటి కఠిన పరిస్థితుల్లో మొదట్లో నిలదొక్కుకొవడానికి ప్రయత్నించామని, తర్వాత పరుగులు వాటంతట అవే వచ్చాయని’  పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా తరపున ప్రపంచకప్‌లో 150కి పైగా పరుగులు సాధించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకు ముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, మాజీ వికెట్‌కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ల పేరిట ఉండేది.  జట్టు తరపున మొత్తం 16 సెంచరీలు చేసిన వార్నర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు.